![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -116 లో....రామలక్ష్మి, సీతాకాంత్ లు పూజ చేస్తుంటారు. సీతాకాంత్ రామలక్ష్మికి బొట్టు పెడతాడు. ఆ తర్వాత కంకనం కడతాడు. అది చూసిన శ్రీలత డిస్సపాయింట్ అవుతుంది. వాళ్ళ నాటకం బయటపెడతారనుకుంటే ఇలా జరిగింది ఏంటని శ్రీలత అనుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి హోమం చేస్తారు. అల్లుడు ఏదో విషయం చెప్పాలన్నాడు.. ఏమై ఉంటుందని ధనతో మాణిక్యం అంటాడు. నేను అదే ఆలోచిస్తున్నానని ధన అంటాడు.
ఆ తర్వాత శ్రీలత, సందీప్ ఇద్దరు పక్కకు వెళ్తారు. మన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. ఇప్పుడు అయిన వాళ్ళ నాటకం బయటపెడతారనుకుంటే హోమం లో కూర్చుని ఉన్నారు. ఇక అన్నయ్య తన మెడలో తాళి కడితే శాశ్వతంగా తను ఈ ఇంటికి కోడలు ఆవుతుంది. అన్నయ్యని ఏకాకిని చేసి ఆస్తి అంత మాకు ఇవ్వాలన్న నీ ఆశ చచ్చిపోయినట్లేనని శ్రీలతతో సందీప్ అంటాడు. ఆ తర్వాత అభికి శ్రీలత ఫోన్ చేసి.. నా ప్లాన్ ఫెయిల్ అయింది. నేనొక ప్లాన్ చెప్తానని శ్రీలత చెప్తుంది. మరొకవైపు సీతాకాంత్, రామలక్ష్మికి రుద్రాక్ష కడతాడు. హోమం పూర్తి అవుతుంది. ఈ రుద్రాక్ష నీకు శ్రీరామ రక్ష అని స్వామి చెప్తాడు. మీరు ఇద్దరు వెళ్లి పెళ్లి బట్టలు మార్చుకొని రండి అని స్వామి చెప్తాడు. ఆ తర్వాత పెళ్లి జరగకుండా చేస్తానని సీతా సర్ చెప్పారు. దానికి ఆయన ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలియడం లేదని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత వెయిటర్ గెటప్ లో కొంతమంది రౌడీలు వచ్చి రామలక్ష్మిని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తారు. అది చూసి శ్రీలత ఒక లెటర్ సీతాకాంత్ కి కనిపించేటట్టు పెడుతుంది.
మరొకవైపు రామలక్ష్మిని బలవంతం గా కిడ్నాప్ చేసి ఆ రౌడీలు అభి దగ్గరకు తీసుకొని వెళ్తారు. కిడ్నాప్ చేయించింది నువ్వా.. నాకన్నా డబ్బున్న అమ్మాయి దొరికిందన్నావ్ కదా అని రామలక్ష్మి అంటుంది. నువ్వు కాదు నీ అందం కావాలి.. ఇన్ని రోజులు ప్రేమించాను.. నీ అందాన్ని అనుభవించాలని అభి అనగానే.. తనని రామలక్ష్మి తిడుతుంది. ఆ తర్వాత గడియ పెట్టి శ్రీలతతో అభి ఫోన్ మాట్లాడతాడు. అభి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాడు. ఆ రామలక్ష్మి సీతాకాంత్ లు ఒకటి అవ్వుతారేమో అని టెన్షన్ పడ్డాను. వాడిని పెళ్లికి దూరంగా ఇన్ని రోజులు ఉంచాను. ఎక్కడ రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటాడో అని భయపడ్డానని శ్రీలత అంటుంది. మీరేం టెన్షన్ పడకండి.. నేను ఈ రామలక్ష్మిని దేశం దాటిస్తానని అభి అంటాడు. అదంతా రామలక్ష్మి విని షాక్ అవుతుంది. మరొకవైపు రామలక్ష్మి నేను పెళ్లి చేసుకులేదని నిజం చెప్పకుండా స్వామి ఆపారు. భవిష్యత్తులో జరగబోయేది స్వామికు తెలుసు.. మరి పెళ్లి బట్టలో రమ్మని చెప్పడంలో అర్థం ఏంటని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.
![]() |
![]() |